ఇండియా ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ్(Mohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 12 ఏళ్ల క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ డిసెంబర్ 3న సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగ సందేశంతో అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 37 ఏళ్ల మొహిత్ శర్మ 2013 నుంచి 2015 మధ్యకాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో 26 వన్డేలు, 8 టి20లు ఆడిన మొహిత్ వన్డేల్లో 35 వికెట్లు, టి20ల్లో 6 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున ప్రదర్శన ఇచ్చిన మొహిత్ ఆ టోర్నీలో 13 వికెట్లు తీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
ఐపీఎల్ కెరీర్‌లో మొహిత్ శర్మ(Mohit Sharma) నాలుగు ఫ్రాంఛైజీల కోసం ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్സ്, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్‌లో మొత్తం 120 మ్యాచుల్లో 134 వికెట్లు తీసి డెత్ ఓవర్లలో అత్యంత నమ్మదగిన బౌలర్‌గా నిలిచాడు. రిటైర్మెంట్ నోట్‌లో మొహిత్ శర్మ తనకు అవకాశమిచ్చిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, మార్గనిర్దేశం చేసిన అనిరుధ్ చౌదరికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన కెరీర్‌లో ఎల్లప్పుడూ అండగా నిలిచిన భార్యకు కృతజ్ఞతలు తెలిపాడు. మొహిత్ శర్మ రిటైర్మెంట్‌తో ఒక ప్రశాంతమైన, క్రమశిక్షణ గల పేసర్ తన ఆట జీవితాన్ని ముగించగా క్రికెట్ అభిమానులు అతని సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
Read Also: గెలుపోటముల్లో టాస్ కీలకం : KL రాహుల్
Follow Us On: WhatsApp Channel


