ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం(SP Balu Statue) ఏర్పాటు ఇప్పుడు వివాదానికి దారి తీసింది. రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్సీబీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. డిసెంబర్ 15న ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్న టైమ్ లో దీనిపై రచ్చ మొదలైంది. ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ఏపీ వ్యక్తి అని.. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేందుకు నిరాకరించిన వ్యక్తి విగ్రహం ఎలా పెడుతారంటూ తెలంగాణ వాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీన్ని అడ్డుకుని తీరుతామంటున్నారు. ఉద్యమకారుడు పృథ్వీరాజ్ కు, విగ్రహ ఏర్పాటు బాధ్యతలు చూస్తున్న సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ కు మధ్య వాగ్వాదం కూడా జరిగింది.
తెలంగాణలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని.. పైడి జయరాజు, కాంతారావు లాంటి వారు ఎంతో మంది ఉన్నారని.. వారందరి విగ్రహాలు పెట్టాలి గానీ.. ఏపీకి చెందిన వ్యక్తుల విగ్రహాలు పెట్టొద్దని అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని.. అలాంటి వ్యక్తికి ప్రాంతాన్ని ఆపాదించొద్దని శుభలేఖ సుధాకర్(Subhalekha Sudhakar) అంటున్నారు. ఈ విషయమే సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. తెలంగాణలో ఏపీ వాళ్ల విగ్రహాలతో పాటు బుద్ధుడి విగ్రహంపై కూడా చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ ఆర్ తో పాటు నార్త్ కు చెందిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి కదా.. వాళ్లవి ఉంటే తప్పు లేదుగానీ పాటలతో అందరినీ మెప్పించిన వ్యక్తుల విగ్రహాలు ఉంటే తప్పా అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.
ఇంకోవైపు బుద్ధుడి విగ్రహంపై కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఇక్కడి వాళ్ల విగ్రహాలే ఉండాలంటే.. అసలు బుద్ధుడి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఇంకొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బయటి వాళ్ల విగ్రహాలు తీసేయాలంటే ముందుగా బుద్ధుడి విగ్రహమే తీయాలంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కళాకారులకు ప్రాంతీయత ఉండదని.. ప్రపంచ వ్యాప్తంగా వారికి అభిమానులు ఉంటారని ఇంకొందరు వాదిస్తున్నారు. విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోతున్నాయి. ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఎస్సీబీ విగ్రహ(SP Balu Statue) ఏర్పాట్లను పరిశీలించారు. మరి దీనిపై నిరసనలు ఇంకా పెరుగుతాయా లేదా అనేది చూద్దాం.
Read Also: క్రికెట్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ గుడ్‌బై
Follow Us On: WhatsApp Channel


