Mobile Popup Ad
Mobile Popup Ad

హైవేపై నిలిచిన వందలాది ట్రక్కులు: అసలేం జరిగింది?

కలం, వెబ్‌ డెస్క్ : మణిపూర్‌ (Manipur)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక ట్రక్ డ్రైవర్‌ను ఇంఫాల్-ఉఖ్రుల్ రోడ్డులోని టి.ఎమ్. కాసోమ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మాటువేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు నిరసనగా వందలాది మంది ట్రక్ డ్రైవర్లు ఈరోజు జాతీయ రహదారి-37 (ఇంఫాల్-జిరిబామ్ రోడ్డు) పై రవాణా సేవలను పూర్తిగా నిలిపివేసి భారీ నిరసనకు దిగారు.

మరణించిన తోటి డ్రైవర్‌కు మద్దతుగా దాదాపు 400 ట్రక్కులు కీథెల్మాన్బి వద్ద నిలిచిపోయాయి. ఇందులో ఎల్‌పీజీ బుల్లెట్ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు, నిత్యావసర సరుకుల వాహనాలు ఉన్నాయి. మణిపూర్ హైవేలపై తమకు రక్షణ కల్పించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. తమకు తగిన భద్రత కల్పించే వరకు, అలాగే జాతీయ రహదారి-102 (ఇంఫాల్-దిమాపూర్ రోడ్డు) ను సాధారణ రాకపోకల కోసం పూర్తిగా తెరిచే వరకు తాము వాహనాలను కదిలించేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>