కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఫన్‌టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసద్ గారు ” (Mana Shankara Varaprasad Garu). ఈ సినిమాలో చిరూ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటిస్తుండగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సంక్రాంతి పండక్కి డైరెక్టర్ అనిల్ మరో బ్లాక్ బస్టర్ అందుకునేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
మెగాస్టార్ చిరంజీవి ఛాన్నాళ్లకు ఎంటర్టైనింగ్ మూవీతో వస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా చూసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకో 6రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. మీలో చంటబ్బాయి ఉన్నారు, ఇంద్ర ఉన్నారు.. బాస్ ని ఎలా అయితే చూడాలనుకున్నారో అలాంటి రోల్ తో ఇంకో 6 రోజుల్లో మీ ముందుకు రానున్నాడంటూ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు.

Read Also: ఫ్యాన్ గర్ల్ తో ప్రభాస్ .. లేటెస్ట్ క్లిప్ వైరల్
Follow Us On: X(Twitter)


