కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ హారర్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ “ది రాజాసాబ్” (The Rajasaab). ఛాన్నాళ్ళకు ప్రభాస్ నుంచి వస్తున్న పక్కా ఎంటర్టైనింగ్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటించారు.
ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. మరో రెండు రోజుల్లో రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో మేకర్స్ వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఒక ఫ్యాన్ గర్ల్‌ని కలిశాడు. తనతో ఎంతో సంతోషంగా ఫోటో దిగి తను ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకున్నాడు. అయితే లేటెస్ట్ క్లిప్ లో ప్రభాస్ (Prabhas) లుక్ అదిరిపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Prabhas Sets Internet Ablaze with New Look Ahead of ‘The Raja Saab’ Release; Meets Lucky Fan Girl! #TheRajaSaab #Prabhas #Maruthi #NidhhiAgerwal #MalavikaMohanan #RiddhiKumar #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/pKucXh0UEd
— Kalam Daily (@kalamtelugu) January 6, 2026
Read Also: “మన శంకర వరప్రసాద్ గారు” : బాస్ కామెడీ టైమింగ్ కు ఇంకా 6 రోజులే
Follow Us On: Sharechat


