కలం, వెబ్ డెస్క్ : కోల్‌కతా నగర వీధుల్లో ఒక వ్యక్తి చేసిన విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యాయామం చేయడం మంచిదే అయినప్పటికీ, దానికి ఎంచుకున్న ప్రదేశం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉన్న ఎత్తైన వీధి లైటు స్తంభాన్ని అతడు తన జిమ్ పరికరంగా మార్చుకున్నాడు.
సదరు వ్యక్తి ఎటువంటి భయం లేకుండా వీధి లైటు పైకప్పు పట్టుకుని వరుసగా పుల్‌అప్స్ (Kolkata Pullups) తీస్తూ కనిపించాడు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా ఈ కసరత్తులు చేశాడు. స్థానికులు కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే లైకులు, కామెంట్లతో దూసుకుపోతోంది. ఇతడి ఫిట్‌నెస్ పిచ్చి చూసి కొందరు ప్రశంసిస్తుంటే, విద్యుత్ స్తంభాలపై ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాలకే ప్రమాదమని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ‘స్ట్రీట్ జిమ్మింగ్’ వీడియో ప్రస్తుతం కోల్‌కతాలో హాట్ టాపిక్‌గా మారింది.

