కలం, వెబ్ డెస్క్: బయో గ్యాస్ పంపిణీలో భాగంగా కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. బయో గ్యాస్ ఉత్పత్తిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ‘గోబర్ధన్ పథకం’ (Gobardhan Scheme) అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.23,731 కోట్లు కేటాయించింది. బయో గ్యాస్ ఉత్పత్తిని దేశమే సొంతంగా తయారు చేసుకునేలా ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. పశువుల వ్యర్థాల నుంచి బయో గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. అలాగే, అసోంలో బైహతా చరియాలీ నుంచి తేజ్‌పూర్ వరకు రూ.8,970 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు.
Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Follow Us On : WhatsApp

