కలం, వెబ్ డెస్క్: అత్యాచారం కేసులో ప్రముఖ జర్నలిస్ట్, తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు (Tarun Tejpal) పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బాంబే హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఆయన నిర్దోషి అంటూ కింది కోర్ట్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. తరుణ్ తేజ్‌పాల్ నేరానికి పాల్పడినట్లు తిరుగులేని ఆధారాలు ఉన్నాయని కోర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రూ.5 లక్షల జరిమానా కూడా విధించిన కోర్ట్.. రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. తీర్పునిస్తున్న సమయంలో తరుణ్ తేజ్‌పాల్ స్పందిస్తూ తనకు 62 ఏళ్ల వయస్సు అని, భార్య ఒంటరిగా జీవిస్తోందని.. మానవత్వంతో తనను క్షమించాలని కోరగా కోర్ట్ పట్టించుకోలేదు.
ఏం జరిగిందంటే..
తెహెల్కా మ్యాగజైన్ ఎడిటర్‌గా పనిచేస్తున్న తరుణ్ తేజ్‌పాల్ (Tarun Tejpal) 2013లో గోవాలో జరిగిన ఈవెంట్లో తన కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే ఏడాది నవంబరులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటకొచ్చారు. ట్రయల్ కోర్టులో విచారణ జరగ్గా, 2021లో తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి అని తీర్పునిచ్చింది. దీనిపై బాంబే హైకోర్టులో గోవా ప్రభుత్వం అప్పీల్ చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన కోర్ట్.. తాజాగా ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Also Read : వీధి లైటుపై పుల్అప్స్.. కోల్‌కతాలో వ్యక్తి హల్చల్!
Follow Us On : WhatsApp

