కలం, వెబ్ డెస్క్ : మందు బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్స్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడినే హతమార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం (Bommalaramaram) మండలం మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం ఈనెల 22న చరణ్, నవీన్, మధు అనే ముగ్గురు స్నేహితులు మద్యం పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఫుల్ బాటిల్ తాగేశారు. బాటిల్లో మిగిలిన చుక్కులు (లక్కీ డ్రాప్స్) తనకు పోయకుండా చరణ్, నవీన్ ఇద్దరే తాగేశారని మధు వారిపై దాడి చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న చరణ్, నవీన్ మధుపై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని సమీపంలోని ఓ ముళ్ల పొదల్లో పడేశారు. అనంతర విషయం తెలుసుకున్న చరణ్ తల్లి పోలీసులకు సమచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

