Mobile Popup Ad
Mobile Popup Ad

అమానవీయ ఘటన.. శ్మశాన వాటికలో ఆరు నెలల పిండం!

కలం, ఖమ్మం బ్యూరో: కన్న ప్రేమకు మించింది ఈ లోకంలో ఏదీ లేదు. కానీ కొంత మంది మాత్రం నవజాత శిశువుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఒక తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకోవాల్సిన తరుణంలో, ముఖం చాటేసి వెళ్ళిపోయింది. అంటే అది ఆమె క్రూరత్వం మాత్రమే కాకపోవచ్చు.. ఆమెను ఆ స్థితికి నెట్టిన సామాజిక పరిస్థితులు, అవమానం, లేదా పేదరికం కావచ్చు. పెళ్లి కాకుండా తల్లి కావడం అనే మాయని మచ్చకు భయపడి కొందరు, ఇప్పటికే ఉన్న సంతానాన్ని సాగలేక మరికొందరు, మరో ప్రాణాన్ని పోషించే శక్తి లేక కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారే తమ పేగు బంధాన్ని తెంపుకుని తమ పసికందులను నిస్సహాయ స్థితిలో వదిలివేస్తున్న సంఘటనలు నిత్యం కోకొల్లలుగా వార్తల్లో నిలుస్తున్నాయి.

తాజాగా అటువంటి మరో దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం పంచాయతీలోని స్మశాన వాటిక దగ్గర శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అభం శుభం తెలియని ఆరు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుట్ట మల్లారం వైకుంఠ ధామం స్మశాన వాటికలోని బాత్రూంలో వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు బాలల పరిరక్షణ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. అంతేతప్పా రోడ్లపై అనాథలుగా చిన్నారులను వదిలి వెళ్లడం సరైంది కాదన్నారు. పిల్లలు లేని వారికి చట్టబద్ధంగా అందజేస్తామని తెలిపారు.

Read Also: పార్ట్‌నర్ నచ్చకపోతే శరీరం తిరుగుబాటు చేస్తుందా..? కొందరు మహిళల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>