కలం వెబ్ డెస్క్ : స్టార్ యాంకర్ అనసూయ(Anchor Anasuya) ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్(Viral) అవుతున్నారు. ఆడవాళ్ల వస్త్రధారణ(dressing) గురించి సీనియర్ నటుడు శివాజీ(Actor Shivaji) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. శివాజీకి కౌంటర్‌గా ” ఈ బాడీ నాదీ నీది కాదు “అంటూ అనసూయ ఈ వివాదంలోకి ఎంటరయ్యింది. ఆడవారు వారికి నచ్చిన విధంగా దుస్తులు ధరిస్తారు. అది వారి స్వేచ్ఛ అంటూ అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్ సూట్ ధరించిన ఫోటోస్ అనసూయ ఇంస్టాగ్రామ్(Instagram)లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇంత రచ్చ జరిగినా కూడా అనసూయ తన పంథా మార్చుకోలేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీకి మరోసారి కౌంటర్ ఇచ్చేందుకే అనసూయ ఇలాంటి ఫోటోస్ అప్లోడ్ చేస్తుందని, వస్త్రధారణ విషయంలో అనసూయ శ్రుతిమించుతోందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు శివాజీని ట్యాగ్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


