వైఎస్ జగన్‌ను కలిసిన మామిళ్లపల్లి బాధితులు

కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)ని పల్నాడు జిల్లా మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన రైతులు కలిశారు. తమ పంట నిల్వ చేసుకున్న గోడౌన్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. రాడ్లతో గోడౌన్‌ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి అరాచకం సృష్టించారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై కూడా దౌర్జన్యానికి దిగారని రైతులు వాపోయారు.

ధూళిపాళ్ల ప్రోద్బలం ఉందంటూ ఆరోపణ

ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (MLA Dhulipalla) ప్రోద్భలం ఉందని రైతులు ఆరోపించారు. ఆయన అనుచరులుగా భావిస్తున్న దాదాపు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోకి వచ్చి భయానక వాతావరణం సృష్టించారని చెప్పారు. గోడౌన్‌పై దాడి చేసిన దృశ్యాలు, ధ్వంసమైన సామగ్రి, తమపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జగన్‌కు చూపించారు.

రాజకీయ కక్షతో దాడులు

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము కష్టపడి పండించిన పంటను భద్రపరిచేందుకు గోడౌన్‌లో నిల్వ చేసుకున్నామని, రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. దాడి సమయంలో మహిళలు, వృద్ధులను కూడా బెదిరించారని తెలిపారు. గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని జగన్‌ను (Jagan) కోరారు. రైతుల వేదన విన్న జగన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధిత రైతులకు పార్టీ తరఫున అండగా ఉంటామని, ఈ ఘటనపై న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Read Also: నీట్ రద్దు.. కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>