Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం..

కలం, వెబ్‌ డెస్క్ : హైదరాబాద్‌ ఆసిఫ్ నగర్ (Asif Nagar) పోలీస్ స్టేషన్ సమీపంలో తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ గోదాం పైన ఉన్న రెండు అంతస్తుల్లో జనం నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్లు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో చిక్కుకున్న వారిని పోలీసులు యుద్ధప్రతిపాదికన ఖాళీ చేయిస్తున్నారు. నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పెను ప్రమాదం తప్పించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>