ఖమైనీ అంత్యక్రియలకు భారత్ ప్రతినిధుల హాజరు

కలం, వెబ్ డెస్క్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఖమైనీ (Khamenei) అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇద్దరు ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరెటాను ఇరాన్ వెళ్లాలని ఆదేశించింది. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడి నుంచి ఆహ్వానం వచ్చిన నేపథ్యంలో ఖమైనీ గౌరవార్థం హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీకి సుప్రీం నేత అభినందనలు..

ఈద్ శుభాకాాంక్షలు చెబుతూ లేఖ పంపినందుకు ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమైనీ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇక మీదట కొనసాగుతాయని ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కూడా ఆకాంక్షించారు. భారత ప్రజలకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ప్రత్యేక లేఖను పంపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>