Mobile Popup Ad
Mobile Popup Ad

జడ్జిలపై దాడులు చేస్తే తీర్పులు ఇవ్వలేం: సుప్రీంకోర్ట్

కలం, వెబ్ డెస్క్: న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులపై జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్ట్ (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అయితే, దేశంలో ఒక్క జడ్జి కూడా తీర్పులు ఇవ్వబోరని స్పష్టం చేసింది. ఇలాంటి అనాగరిక చర్యలకు వీలైనంత త్వరగా అడ్డుకట్ట పడాల్సిందేనని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్‌లో ఓ న్యాయాధికారి ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల విధులకు ఆటంకం కలిగించడం అనేది న్యాయ ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేసే అంశమని హెచ్చరించింది.

జడ్జి మనవరాలిని కూడా బెదిరించారు..

బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ జీఎస్.పాటిల్‌కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తున్నట్లు తమకు తెలిసిందని సుప్రీంకోర్ట్ (Supreme Court) పేర్కొంది. ‘లండన్‌లో ఉంటున్న పాటిల్ మనవరాలిని కొందరు వ్యక్తులు ఏకంగా చంపడానికి ప్రయత్నించారు. జడ్జి తీర్పులతో ఆమెకు ఏం సంబంధం?’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. అనంతరం, కేసు తీవ్రత నేపథ్యంలో సదరు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

Read Also: బెంగాల్‌లో మాజీ మంత్రిపై కోడిగుడ్ల‌తో దాడి.. అరెస్ట్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>