కలం, వెబ్ డెస్క్: జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీ మల్లు (Mallu Ravi) రవి కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి రాజీనామాకు గల కారణాలపై మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు రాజ్యసభ అవకాశం దొరకనందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉండి ఇప్పుడు పదవి ఇవ్వనందుకు పార్టీని వదిలారని విమర్శించారు. జీవన్ రెడ్డి దొరల పార్టీ అయిన బీఆర్ఎస్‌లో చేరి పెత్తందారీ వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడటం దారుణమన్నారు. అసలు కేసీఆర్ మళ్లీ ఎందుకు అధికారంలోకి రావాలో జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద పదవులు ఇస్తామని, ప్రత్యేక గుర్తింపు ఇస్తామని చెప్పడం జీవన్ రెడ్డికి తాత్కాలికంగా సంతోషంగా ఉండవచ్చని మల్లు రవి అన్నారు. కానీ, జీవితమంతా ఆయన పెంచి పోషించుకున్న వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకోవద్దని, గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. ఇలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏమైందో అంతా చూశారని పేర్కొన్నారు.
Read Also: తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతా: సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: Instagram

