తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతా: సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: తనపై తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ మంత్రి సీతక్క (Seethakka)  బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణగారిన వర్గాలు, సామాన్యులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేదని పేర్కొన్నారు. అందుకే తన మీద నిత్యం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్లు పంచుతుంటే స్కాం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రూ. 11650 మొబైల్ కొనుగోలు చేస్తే రూ. 14500 కి కొనుగోలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మొబైల్స్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు. కోట్ల కుంభకోణం జరిగిందని ఊహాజనిత కథనాలు అల్లుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు

తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘అవినీతి సీతక్క అని తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త’ అంటూ సీతక్క (Seethakka) హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారమే, కేంద్రం నిర్దేశించిన ధరలకు లోబడే థర్డ్ పార్టీ ద్వారా మొబైల్స్ ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేశామని వివరించారు. సాంకేతిక సామర్థ్యం ఉన్న ఐటీ శాఖ పరిధిలోని టీజీటీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ GeM ద్వారా కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మనం కొనుగోలు చేసిన మోడల్ మొబైల్‌లను ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు చేశాయని చెప్పారు. రాష్ట్రం పచ్చబడుతుంటే బీఆర్ఎస్ నాయకుల కండ్లు ఎర్రబడుతున్నాయంటూ మండిపడ్డారు.

నిరాధార ఆరోపణలు

బీఆర్ఎస్ పార్టీ తన మీద నిరాధార ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఏ పని చేసిన అవినీతి ముద్ర వేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. 200 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేస్తే అవినీతి జరిగిందంటూ కారు కూతలు కూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ శ్రేణులు వెంటనే తిప్పికొట్టాలని.. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Read Also: జీవన్ రెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారు: పీసీసీ చీఫ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>