కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. పార్టీలో సీనియర్ నేతగా ఆయన మీద తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. అయితే ఆయన ఇంతకాలం తీవ్రస్థాయిలో విమర్శించి.. ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీని జీవన్ రెడ్డిలా ఏ కాంగ్రెస్ నేత విమర్శించలేదని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో జీవన్ రెడ్డి లెక్కలతో సహా చెప్పేవారని గుర్తు చేశారు. అటువంటి నేత పార్టీ మారడం తమకు ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు.
పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చాం
జీవన్ రెడ్డికి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చామని గుర్తు చేశారు. స్థానికంగా చిన్న సమస్య జరిగితే దాన్ని అడ్డుపెట్టుకొని పార్టీ మారడం సరికాదన్నారు. ప్రజలు కేసీఆర్ ను కోరకుంటున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఆయన (Mahesh Kumar Goud) బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడాన్ని జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇప్పటికీ ఆయన మీద తమకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: ప్లస్సా.. మైనస్సా.. జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై కొత్త చర్చ
Follow Us On: X(Twitter)

