కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అడంపూర్ (Aadampur) ప్రాంతంలో మూఢనమ్మకం కారణంగా 14 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పీతంపూర్ గ్రామానికి చెందిన అమిత్ (14) పాముకాటుకు గురయ్యాడు. తక్షణ వైద్య చికిత్స అందించాల్సిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మంత్రగాళ్లను ఆశ్రయించారు.
వారి మాటలను నమ్మిన కుటుంబం, పామువిషం తొలగిపోతుందనే నమ్మకంతో బాలుడిని చెక్కకు కట్టి గంగా నదిలో సుమారు 12 గంటల పాటు ఉంచినట్లు సమాచారం. ఈ సమయంలో సరైన వైద్య సహాయం అందకపోవడంతో బాలుడి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. చివరికి పరిస్థితి విషమించి అమిత్ మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మూఢనమ్మకాల కారణంగా చిన్నారి ప్రాణం కోల్పోవడంపై స్థానికంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
Read Also: సర్కార్ వర్సెస్ ఆర్టిజన్స్.. సర్వీస్ రూల్స్ కోసం సమరం
Follow Us On: X(Twitter)

