బీహార్ ఎన్నికలు(Bihar Polls) రసవ్తరంగా మారుతున్నాయి. ఎన్‌డీఏ, మహాగఠ్‌బంధన్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. ఈ క్రమంలోనే మహాగఠ్‌బంధన్(Mahagathbandhan)లో వివాదాలు మొదలయ్యాయి. సీఎం అభ్యర్థిగా ఆర్‌జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌ను తొలుత కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో ఆర్‌జేడీ, కాంగ్రెస్ మధ్య అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. సీట్ల విషయంలో కూడా పొత్తు కుదరలేదు. దీంతో ఆర్జేడీ నేతలతో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక భేటీ అయ్యారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు పార్టీల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకున్నారు. కాగా, సీఎం అభ్యర్థిపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్(Tejashwi Yadav)ను ఖరారు చేశారు. ఆయన నాయకత్వంలోనే బీహార్‌లో మహాగఠ్‌బంధన్ ముందుకెళ్లడానికి రెడీ అయింది. కాగా సీఎం అభ్యర్థిపై గురువారం సాయంత్రానికల్లా అధికారిక ప్రకటన చేయాలని నిశ్చయించుకున్నాయి.
Read Also: రేవంత్‌కు ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు: HYC సల్మాన్

