దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ అయిన సినిమా ‘తెలుసు కదా(Telusu Kada)’. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. ఈ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా హీరో సిద్ధూ(Siddhu Jonnalagadda).. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ తాను కాదని చెప్పాడు. ‘‘ఈ సినిమా ఫస్ట్ నాదగ్గరకి రాలేదు. ఈ కథ ఫస్ట్ నితిన్ దగ్గరకి వెళ్లింది. ఆ కథ విన్న నితిన్(Nithin).. రాత్రి నాకు ఫోన్ చేసి.. ‘నీకు మంచి కథ ఉంది. నీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. నువ్వు విను’అని చెప్పాడు. ఆ తర్వాత ఈ సినిమా నా దగ్గరకు వచ్చింది. లేదంటే ఈ సినిమాతో ఫస్ట్ హీరో నితిన్. ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం నాకు వచ్చింది’’ అని చెప్పాడు.
అయితే హీరో నితిన్ ప్రస్తుతం హిట్ కోసం తహతహ లాడుతున్నాడు. వరుస ఫ్లాప్స్‌తో కష్టకాలంలో ఉన్న నితిన్.. మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో వచ్చిన ‘తెలుసు కదా(Telusu Kada)’ మూవీని రిజెక్ట్ చేయడంతో మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు ఈ సినిమా సిద్దూ చేశాడు కాబట్టే హిట్ అయిందని, నితిన్ చేసి ఉంటే ఫ్లాప్ అయ్యుండేదని వ్యంగ్యంగా చురకలంటిస్తున్నారు.
Read Also: ‘కాంతారా-1’లో రిషబ్ డ్యూయల్ రోల్ చేశాడా..!

