Delhi Encounter | ఢిల్లీలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న కాల్పుల్లో పోలీసులు నలుగురు క్రిమినల్స్‌ను హతం చేశారు. ఢిల్లీ రోహిని ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రంజన్ పాఠక్, విమలేష్ మహ్త సహా మరో ఇద్దరు క్రిమినల్స్ మరణించారు. బీహార్‌లో పలు హత్యలు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేయడం కోసం బీహార్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అందులో భాగంగానే నిందితులను చేజ్ చేస్తున్న క్రమంలో వారు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాంతో చేసేదేమీ లేక ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. కాల్పులు ముగిసిన అనంతరం గాయపడిన వారిని హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితులు మరణించినట్లు గురువారం తెల్లవారుజామున వైద్యులు నిర్ధారించారు.
Read Also: మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి ఖరారు..

