Mobile Popup Ad
Mobile Popup Ad

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ కుష్బూ గుప్తా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసు కోవాలని మహబూబ్‌నగర్ (Mahabubnagar) కలెక్టర్ కుష్బూ గుప్త సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా విద్య వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ‘లైబ్రరీ డే’ ను నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు.

అనంతరం లైబ్రరీ లో కలెక్టర్ పాఠకులతో, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెట్టు గడ్డ గ్రంథాలయ భవనం పక్కన నిరూపయోగంగా ఉన్న ఎన్సీఎల్పీ భవనాన్ని గ్రంథాలయానికి కేటాయించే విషయం పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రవీణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్ కుమార్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

Read Also: అప్పుడు బెంగాల్.. ఇప్పుడు తెలంగాణ.. కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>