‘పెద్ది’ రిలీజ్‌పై ఎలాంటి డౌట్స్ లేవు: దిల్ రాజు

కలం, సినిమా : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరుగుతున్న థియేటర్స్ అద్దె, పర్సెంటేజ్ వివాదం కారణంగా రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. తాజాగా జరిగిన సమావేశం ద్వారా ఈ వివాదంపై స్పష్టత వచ్చింది. ‘పెద్ది’(Peddi) సినిమా జూన్ 4న ఖచ్చితంగా విడుదల అవుతుందని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన తెలిపారు.

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసిందని ఆయన చెప్పారు. సినిమా రంగంలో పర్సెంటేజ్ విధానంపై నిర్మాతలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించేందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. అన్ని వర్గాల మధ్య సమన్వయం సాధించేలా ఈ సమావేశం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>