epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ధర్మరాజునే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

కలం డెస్క్: మహాభారతం టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రలో నటించిన గజేంద్ర సింగ్ (Gajendra Singh) సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన క్రమంలో సైబర్ నేరగాళ్లు అతడిని టార్గెట్ చేశారు. అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.98వేలు కాజేశారు. వెంటనే తాను సైబర్ ఫ్రాడ్ వలలో చిక్కుకున్నానని గ్రహించి ఆయన పోలీసులను ఆశ్రయించారు.

అంధేరి వెస్ట్‌లోని లోఖండ్వాలా–ఓషివారా ప్రాంతంలో గజేంద్ర సింగ్ నివసిస్తున్నారు. డిసెంబర్ 10న ఫేస్‌బుక్‌లో డీ-మార్ట్ (D-Mart) పేరుతో వచ్చిన భారీ డిస్కౌంట్ డ్రై ఫ్రూట్స్ ప్రకటనను చూశారు. ఆ లింక్‌పై కొనుగోలు చేసిన డ్రైఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. ఆ సమయంలోనే అతని మొబైల్‌కు ఒక ఓటీపీ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.98వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసిన వెంటనే తాను సైబర్ మోసానికి గురైనట్టు గ్రహించారు. వెంటనే ఆయన పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదుపై ఓషివారా పోలీస్ స్టేషన్‌కు చెందిన ముంబై సైబర్ సెల్ తక్షణమే స్పందించింది. గజేంద్ర చౌహాన్ ఖాతా నుంచి పోయిన రూ.98,000 మొత్తాన్ని పూర్తిగా రికవర్ చేసింది. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ చవాన్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ పగారే నేతృత్వంలో ఓషివారా పోలీస్ సైబర్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. సైబర్ సబ్ ఇన్‌స్పెక్టర్ శరద్ దేవరే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కొండే, కానిస్టేబుల్ విక్రమ్ సార్నోబాట్ 1930 హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు.

దర్యాప్తులో మోసపోయిన మొత్తం రోజ్‌పే(Razorpay) ద్వారా క్రోమా(Croma)కు సంబంధించిన ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్, రోజ్‌పే(Razorpay), క్రోమా(Croma) సంస్థల నోడల్ అధికారులను సంప్రదించి ఈమెయిల్ ద్వారా సమన్వయం చేశారు.

పోలీసుల వేగవంతమైన చర్యల వల్ల లావాదేవీని సకాలంలో నిలిపివేసి, రూ.98,000 మొత్తాన్ని పూర్తిగా నటుడి ఖాతాలోకి తిరిగి జమ చేశారు. పోలీసుల చురుకైన చర్యలను అభినందించిన గజేంద్ర సింగ్ చౌహాన్ (Gajendra Singh), ముంబై పోలీసులకు, ఓషివారా పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: హైదరాబాద్‌లో అతి పెద్ద సైబర్ మోసం.. 14 కోట్లు కొట్టేశారు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>