కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) రేపు ఆదివారం తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. తెలంగాణ నదీ జలాలపై బీఆర్ ఎస్ పోరుకు సిద్ధం అవుతోంది. దీనిపై రేపు బీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం నిర్వాహిస్తారు కేసీఆర్ (KCR). రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడాల్సిన విషయాలు, సాగునీటి హక్కుల రక్షణ కోసం చేయాల్సిన పోరాటాల మీద రేపు కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే గులాబీ బాస్ ఇక నుంచి ప్రజల్లోనే ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కేసీఆర్ మూడు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోనే ఈ సభలు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారంట.
మహబూబ్ నగర్ లో మొదటి సభ, రెండోది రంగారెడ్డి జిల్లాలో, మూడోది ఇంకో చోట ప్లాన్ చేస్తున్నారంట. వీటిపై రేపు కేసీఆర్ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. బీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతారని బీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. దీంతో రేపు కేసీఆర్ ఏం మాట్లాడుతారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: డిసెంబర్ ఓ మిరాకిల్ మంత్ : సీఎం రేవంత్
Follow Us On: Sharechat


