epaper
Wednesday, February 18, 2026
epaper

రాజ్యాంగ విరుద్ధంగా ‘సర్​’ .. సీఈసీకి ఎంఎ బేబి లేఖ

కలం, వెబ్​డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి (MA Baby) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్​ కుమార్​కు శనివారం లేఖ రాశారు. సర్ ​(Special Intensive Revision – SIR) ప్రక్రియ చట్టపరమైన విధానాలకు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు.

ఎలక్షన్స్​కు కేవలం కొన్ని నెలల ముందు, తక్కువ సమయంలో విస్తృతంగా ఓటర్ల సవరణ చేయడం వల్ల ఎన్నికల వాతావరణం దెబ్బతినే అవకాశముందన్నారు. ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగే ప్రమాదం పెరుగుతుందని, అన్యాయంగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు.

‘ కాలానికి తగినట్లు ఓటర్ల జాబితాను సవరించడం సాధారణ, ప్రజాస్వామ్యపరంగా అవసరమైన ప్రక్రియే అని అంగీకరిస్తున్నాం. అయితే, ప్రస్తుతం ‘సర్’​ చేపట్టిన విధానం, సమయం, అమలు పద్ధతి మాత్రం సరిగా లేదు. ఇది చట్టపరమైన విధానాలు, గత సంప్రదాయాలు, రాజ్యాంగ సూత్రాలకు స్పష్టంగా విరుద్ధంగా ఉంది’ అని లేఖలో ఎం.ఎ.బేబి (MA Baby) పేర్కొన్నారు.

Read Also: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్.. ఐదు రోజులైనా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>