అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్.. ఐదు రోజులైనా!

కలం, వెబ్ డెస్క్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన కర్ణాటక (Karnataka)కు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (Saket Srinivasaya) అనే 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సాకేత్ శ్రీనివాసయ్య 2025లో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ’ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీసులు, భారత దౌత్య కార్యాలయం అలర్ట్ అయ్యింది.

సాకేత్ చివరిసారిగా బర్కిలీ (Berkeley) క్యాంపస్‌కు సమీపంలో కనిపించినట్లు సమాచారం. అదృశ్యమైన కొద్దిరోజుల తర్వాత ఓ ఇంటి ముందు సాకేత్‌కు చెందిన బ్యాగ్ (Bag) లభ్యమైంది. ఆ బ్యాగ్‌లో సాకేత్ పాస్‌పోర్ట్, లాప్‌టాప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సాకేత్ (Saket Srinivasaya) ఆచూకీ కనుగొనేందుకు స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. సాకేత్ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.

Read Also: MPTC, ZPTC ఎన్నికలపై సీఎం కీలక చర్చ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>