ఏపీ పర్యటనకు బిల్ గేట్స్

కలం, వెబ్​ డెస్క్​ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates AP Tour) ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోని ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా ఈ భేటీ జరగనుంది. సచివాలయంలో చర్చల అనంతరం బిల్ గేట్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శిస్తారు.

Read Also: గాయత్రి ఫైనాన్స్​ యజమాని మిస్టరీ డెత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>