epaper
Wednesday, February 18, 2026
epaper

వింటర్​ ఒలింపిక్స్​లో కండోమ్స్​ కొరత.. 72 గంటల్లో 10 వేలు ఖాళీ

కలం, వెబ్ డెస్క్: ఇటలీ (Italy)లో జరుగుతున్న మిలాన్ –కోర్టినా వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల కోసం కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ కండోమ్స్ కేవలం 72 గంటల్లోనే ఖాళీ అయ్యాయి. ఒలింపిక్స్‌లో దాదాపు 3,000 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, నిర్వాహకులు కేవలం 10,000 కండోమ్‌లను మాత్రమే అందుబాటులో ఉంచారు. గేమ్స్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే కండోమ్స్ అయిపోవడంతో క్రీడాకారులు షాక్ అయ్యారు. త్వరలోనే మరిన్ని కండోమ్స్ నిల్వలు అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, వాటిపై క్లారిటీ లేదని క్రీడాకారులు అంటున్నారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఇక్కడి (Italy) ఏర్పాట్లు చాలా తక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు 10,500 మంది అథ్లెట్ల కోసం 3,00,000 కండోమ్‌లను పంపిణీ చేశారు. అంటే ఒక్కో అథ్లెట్‌కు రోజుకు సగటున రెండు చొప్పున అందుబాటులో ఉంచారు. కానీ ప్రస్తుత వింటర్ క్రీడల్లో పదివేల లోపే కండోమ్స్ (Condom) సరఫరా చేయడాన్ని స్థానిక పత్రికలు సైతం తప్పుపట్టాయి.

క్రీడాకారుల కోసం హాకీ, కోకాకోలా, పియానో లాంటివి ఏర్పాటుచేసినప్పటికీ, కండోమ్స్ కొరత చర్చనీయాంశమైంది. దీనిపై నిర్వాహకులు రియాక్ట్ అవుతూ.. ఇది వివాదం చేయాల్సిన విషయం కాదని కొట్టిపారేశారు.

Read Also: ఓటు వేయలేదా? మా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి మరి!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>