జాతీయ పోలీస్ క్రీడా పోటీల్లో ఏఎస్ఐ ఉమారాణికి కాంస్య పతకం!

కలం, ​కరీంనగర్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించిన అఖిల భారత పోలీస్ క్రీడా పోటీల్లో (All India Police Games) కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కి చెందిన ఏఎస్ఐ ఉమారాణి (ASI Umarani) ప్రతిభ చాటింది. అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించింది. ​ఈ నెల 9 నుంచి 13 వరకు లక్నోలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఉమారాణి ఉమెన్ డబుల్స్ విభాగంలో (50+ Women Doubles) తెలంగాణ పోలీస్ శాఖ తరపున ప్రాతినిధ్యం వహించింది. జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారు. పోటీలు ముగించుకొని కరీంనగర్‌కు చేరుకున్న ఆమె శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన కాంస్య పతకాన్ని, సర్టిఫికెట్‌ను చూపించారు. ​ఉమారాణి ప్రతిభను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. 50 ఏళ్ల వయసులోనూ విధి నిర్వహణతో పాటు క్రీడల్లో ఈ స్థాయి ప్రతిభ కనబరచడం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>