సంగారెడ్డి లో వెరైటీ పండ్ల ఫల పరిశోధన కేంద్రం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలోని అస్తబల్‌ ప్రాంతం…నాటి నైజాం పాలనలో గుర్రాల పాకగా ఉపయోగించిన మైదానం నేడు ఫల పరిశోధన కేంద్రంగా వెలుగొందుతుంది. నైజాం పాలనలో నాటించిన మామిడి మొక్కలు, జామ తోటల పెంపకంతో దినదిన అభివృద్ధి చేస్తూ నేడు దేశంలో ప్రముఖ ఫల పరిశోధన కేంద్రంగా నిలుస్తుంది సంగారెడ్డిలోని ప్రూట్ రిసెర్చ్ స్టేష‌న్.

నిజాం జ‌మానా నుంచే..

హైద‌రాబాద్ సంస్థానంకు ప‌రిపాలించిన నిజాం రాజులు …క‌ర్ణాట‌క, మ‌హ‌రాష్ట్ర వైపు వెళ్తున్న‌ప్పుడు నిజాం రాజులు, సైనిక‌ద‌ళాలు , అధికారులు ప్ర‌య‌ణాల‌కు గుర్రాల‌ను ఉప‌యోగించేవారు. ప్ర‌యాణంలో అలసిన గుర్రాల‌ను ఉంచ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్ల‌తో గుర్ర‌పు శాల‌ను అస్త‌బ‌ల్ పేరుతో సంగారెడ్డిలో ప‌ట్ట‌ణంలో ఏర్పాటుచేశారు. నిజాం రాజులు దేశ విదేశాల నుంచి వివిధ ర‌కాల‌ మామిడి మొక్కలను సేకరించి వందల ఎకరాలు విస్తరించి ఉన్న సంగారెడ్డి లోని అస్త‌బ‌ల్ ప్రాంతంలో నాటారు. సుమారు వంద‌ల‌ రకాలకు మామిడి , శీతాఫ‌లం పండ్ల‌ మొక్కలు నాటడంతో ఈ ప్రాంతం పెద్ద తోటగా మారింది. స్వాతంత్రం తరువాత అస్త‌బ‌ల్ ప్రాంతంను ప్రభుత్వం అధ్వర్యంలో ఫల పరిశోధన కేంద్రంగా మార్చింది. ఇక్క‌డ‌ మామిడితో పాటు జామ, శీతాఫలం, సపోటపైనా ప‌లు ర‌కాల‌ పరిశోధనలు నిర్వహిస్తుంటారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు ర‌కాల‌ ఫల పరిశోధనల‌కు కేంద్రంగా సంగారెడ్డి ఎఫ్‌ఆర్‌ఎస్‌కు పేరుంది. ఈ కేంద్రం సుమారు 161 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడ నుంచి మేలు రకమైన కొత్త వైరెటిల వంగడాలను రూపొందించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సంగారెడ్డి ఎఫ్అర్ఎస్ కేంద్రంలో అభివ్ర‌ద్ధి చేసి రూపొందించిన వెరైటీ మామిడి ర‌కాలను ప‌రిశీలించేందుకు వివిధ దేశాల‌కు చెందిన శాస్త్ర‌వేత్తలు ప‌ర్య‌టిస్తుంటారు. జామ ,శీతాఫ‌లం,సపోట ర‌కాలపైన చెప్పుకోద‌గ్గ ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తుంటారు. చీడ పీడ‌ల ప్ర‌భావం లేకుండా , అధిక దిగుబ‌డి ల‌క్ష్యంగా మార్కెట్ అవ‌స‌రాల‌ను అనుగుణంగా కొత్త‌ర‌కం వ‌గండ‌ల‌ను అభివృద్ధి చేస్తుంటారు ఉద్యానవ‌న శాస్త్ర‌వేత్తలు.

దేశ‌వ్యాప్తంగా ఎగుమ‌తి

సంగారెడ్డి ఫ‌ల ప‌రిశోధ‌న కేంద్రంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీని అభివృద్ధి కోసం కృషి చేసి మామిడి రకాలను 477 వరకు పెంచారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లో ప‌రిశోధ‌న‌లు చేసిన వివిధ మామిడి ర‌కాల‌ను సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 15 వేల ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతారు రైతులు. అంతేకాకుండా ఎఫ్‌ఆర్‌ఎస్‌ కేంద్రంలో అభివృద్ధి చేసిన వ‌గండాల‌ను సంగారెడ్డి , కొండాపూర్ మండలంలోని వంద‌లాది న‌ర్సరీల‌లో పెంచుతూ దేశ‌వ్యాప్తంగా సప్లయ్ చేస్తూ ఉపాధి పొందుతుంటారు. దసేరీ, కలాకాండ్, లంగ్డా, హిమాయత్‌, బేనిషాన్‌, పంచదార, చెరుకు రసాల్‌, నాగిని, మంజీర.. ఇలా వందల రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లో అభివృద్ధి చేసిన‌ మంజీర రకం మామిడి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లో వెరైటీ మామిటి ర‌కాలు ,ఇత‌ర పండ్ల‌కు సంబంధించిన న‌ర్స‌రీల‌ను శాస్త్ర‌వేత్తల అధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తుంటారు . సంగారెడ్డి ఎఫ్‌ఆర్‌ఎస్‌ నర్స‌రీల మొక్క‌ల‌కు దేశ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు ప‌ది ర‌కాల జామ‌, ఆరు ర‌కాల సీతాఫ‌లం, 8 ర‌కాల స‌పోటా ర‌కాలు ప్రూట్ రిసెర్చ్ స్టేష‌న్ లో ఉన్నాయి. పూణెలోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ వెయ్యి మామిడి రకాలతో మొదటి స్థానంలో ఉండగా, 477 పైగా వెరైటీల‌తో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. ప్ర‌సుత్తం సంగారెడ్డి ఫ‌ల‌ పరిశోధనా కేంద్రాన్ని శ్రీ కొండ లక్షణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఎఫ్ఆర్ఎస్ వేదిక‌గా శాస్త్ర‌వేత్తలు కొత్త వెరైటీల మీద ప‌రిశోధ‌న‌లు, నాణ్య‌మైన మామిడి, ఇతర ఫల మొక్కల నర్సరీ నిర్వ‌హిస్తుంటారు. అంతేకాకుండా ఉద్యాన శాఖ అధ్వ‌ర్యంలో పండ్ల పెంప‌కం మీద‌, కొత్త‌గా వ‌స్తున్న వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తులు ,మార్కెటింగ్ అంశాల‌పై రైతులకు అవ‌గాహ‌న , శిక్షణ ఇస్తుంటారు. వేస‌వికాలంలో మామిడి పండ్ల సీజ‌న్ అస్త‌బ‌ల్ తోటల‌లో పండిన వివిధ వెరైటీ పండ్లను ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>