Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. సిలిండర్ల బుకింగ్ గడువు పెంపు

కలం, వెబ్ డెస్క్: వంట గ్యాస్ వినియోగదారులకు మరో భారీ షాక్ తగిలింది. వంటగ్యాస్ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 45 రోజుల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎల్‌పీజీ (LPG Booking)  కొరత నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే గడువును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరోసారి బుకింగ్ చేసేందుకు 25 రోజుల గడువు ఉండగా, దాన్ని 45 రోజులకు పెంచారు. గ్యాస్ వినియోగాన్ని నియంత్రించడం, సరఫరాను సమర్థంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లోని గ్యాస్ వినియోగదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తించనున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Read Also: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో హాఫ్‌డే స్కూళ్ల తేదీలు ఖరారు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>