కలం, వెబ్ డెస్క్: మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య జ్యోతిని ఉన్నత చదువులు చదివించాడు. ఆపై ఆమెను ఎక్సైజ్ సీఐగా ఎదిగేందుకు అండగా నిలిచాడు. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు మొదలైంది. భర్తను దూరం పెడుతూ అతనిపైనే వరకట్న వేధింపులు, విడాకుల కేసులు నమోదు చేయడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య వేధింపుల తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు భార్య వేధింపులే కారణం’ అని సూసైడ్ (Suicide) నోట్‌లో పేర్కొన్నాడు. ఒకరికి అండగా నిలిచిన వ్యక్తికే ప్రాణసంకటంగా మారడం అందరినీ కలిచివేస్తోంది.

