Mobile Popup Ad
Mobile Popup Ad

ఎర్రజొన్న రైతుకు ఎంతకష్టమొచ్చే.. ఇందూరులో దళారుల దోపిడీ

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూర్ (Nizamabad) జిల్లా పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, ఇందూర్ రూరల్ నియోజకవర్గాల్లో రైతులు పెద్ద ఎత్తున ఎర్రజొన్న పంట (Red Sorghum Crop)ను సాగు చేస్తున్నారు. కానీ, ప్రస్తుత సీజన్‌లో వ్యాపారులంతా కుమ్మక్కై సిండికేట్‌గా ఏర్పడ్డారు. రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. వాస్తవానికి మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4000 వరకు మద్దతు ధర ఉన్నప్పటికీ, ఈ సిండికేట్ రూ.3300కు తగ్గించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రైతులను ముంచడం, వారి కష్టాన్ని అడ్డగోలుగా దోచుకోవడం వ్యాపారులకు దందాగా మారింది. గత్యంతరం లేక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఇప్పటికే సుమారు 20 శాతం పంటను ఈ తక్కువ ధరకే విక్రయించి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో మార్కెట్లో దళారులదే రాజ్యంగా మారింది. ఈ సమస్యపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ డిమాండ్ స్పందించారు. వెంటనే రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందించారు. రైతులు పండించిన పంటకు అత్యధిక ధర దక్కేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>