రెండు జిల్లాల‌ సరిహద్దుల్లో చిరుత సంచారం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad), సిరిసిల్ల (Sircilla) సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుత పులి (Leopard) సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిరికొండకు ఆనుకొని ఉన్న సిరిసిల్ల అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నందున ద‌గ్గ‌ర్లోని గ్రామాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిరికొండ అటవీ రేంజ్ అధికారి నర్సింగరావు సూచించారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, పందిమడుగు గ్రామాల చుట్టూ పులి కదలికలు ఉన్నాయి.

పులి గురించి అప్ర‌మ‌త్తం చేయ‌డంతో పాటు అధికారులు ఆయా గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే అటవీ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించే చర్యలకు పూనుకోవద్దని సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి గంగారం శిక్షణ అధికారి కృష్ణ గీత్ సిబ్బంది పాల్గొన్నారు.

 Read Also: అది అత్యాచారయత్నమే : సుప్రీం కోర్టు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>