విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ

క‌లం, వెబ్ డెస్క్‌: విశాఖప‌ట్నంలో నేడు ఉద‌యం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (International Fleet Review) ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తూర్పు నావికా ద‌ళంలోని 71 యుద్ధ నౌక‌లు రాష్ట్రపతికి గౌరవ వందనం స‌మ‌ర్పించాయి. జాతీయ గీతాన్ని ఆల‌పించిన అనంత‌రం ఐఎఫ్ఆర్ 21 తుపాకులను ఫైర్ చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) త‌న స‌తీమ‌ణి అన్నాలెజినోవాతో కలిసి హాజర‌వ‌డంం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఫ్లీట్‌ రివ్యూ అంటే ఏమిటి…

ఫ్లీట్ రివ్యూ (International Fleet Review) అనేది నౌకాదళ శక్తి, సామర్థ్యాలను దేశాధ్యక్షుడి ముందు ప్రదర్శించే కార్యక్రమం. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి నౌకాదళం నిర్వహించే పరేడ్‌ను పరిశీలిస్తారు. యుద్ధ నౌకలు సముద్రంలో వరుసగా నిలబడి గౌరవ వందనం సమర్పిస్తాయి. దేశ భద్రత, సముద్ర సార్వభౌమత్వం, నౌకాదళ సిద్ధతను ప్రపంచానికి తెలియజేయ‌డం ఈ కార్య‌క్ర‌మం ముఖ్య‌ లక్ష్యం. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో విదేశాల నౌకాదళాలు కూడా పాల్గొంటాయి.

 Read Also: ఫ్లైట్ టికెట్టూ నాదే, మ్యాచ్ టికెట్టూ నాదే.. జగన్‌పై లోకేశ్ సెటైరికల్ ట్వీట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>