నీటి కోసం వ‌చ్చి.. కుక్క‌ల దాడిలో చ‌నిపోయిన‌ చిరుత పిల్ల!

క‌లం, వెబ్ డెస్క్‌: కడప (Kadapa) జిల్లా దువ్వూరు మండలం చిన్నబాకరపురం గ్రామ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎండల తీవ్రతతో తాగునీటి కోసం అడవి నుంచి వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన చిరుత పిల్ల (Leopard Cub)పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిరుత పిల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పులులు, ఏనుగులు వంటి అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఎండల తీవ్రత దృష్ట్యా నీటి కొరత ఏర్పడటంతో మరిన్ని వన్యప్రాణులు అడవులను దాటి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవి ప్రమాదాల బారిన పడటమే కాకుండా, ప్రజలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు అటవీ ప్రాంతాల్లో నీటి వసతి కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: అవును పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను.. త్రిష షాకింగ్ కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>