అవును పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను.. త్రిష షాకింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: తన పెళ్లి, రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లకు స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటుడు చిత్రా లక్ష్మణన్ (Chitra Lakshmanan) త్రిష వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని కామెంట్ చేశారు. ఈ వార్తలపై స్పందించిన త్రిష ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సెటైర్లు వేశారు.

‘‘అవును, నేను సినిమాలు మానేశాను. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నలుగురు పిల్లల్ని కూడా కన్నాను. మీ ఊహాగానాలకు ఈ సమాచారం సరిపోతుందా? ఈరోజు మీరు వార్తలు రాసుకోవడానికి ఇది చాలు అనుకుంటా.. ఇంకా ఏదైనా జోడించమంటారా?’’ అంటూ పుకార్లను పుట్టించే వారికి గట్టి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం త్రిష (Trisha) పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: అల్లు అర్జున్, అట్లీ మూవీ ప్రీ లుక్ పోస్టర్ విడుదల..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>