మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు నుంచి తేరుకోకముందే మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు అయిన తక్కళ్లపల్లి వాసుదేవరావు(Thakkallapalli Vasudeva Rao) అలియాస్ ఆశన్న కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 70 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయారు. గురువారం వీరు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముందు ఆయుధాలను విడువనున్నారు.
ఆశన్న నేపథ్యం
తక్కళ్లపల్లి వాసుదేవరావు(Thakkallapalli Vasudeva Rao) అలియాస్ ఆశన్న.. 1970లో ఖమ్మం జిల్లాలో జన్మించారు. 1990లోనే ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అనేక పదవుల్లో ఆయన పనిచేశారు. పార్టీ రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాలు, ప్రచార విషయాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రెడ్ కారిడార్ ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేదని పోలీసులు చెప్తున్నారు. ఆయన తలపై కేంద్రం రూ.10 లక్షల బహుమతి ప్రకటించింది.
Read Also: రఫ్ఫాడించిన షమీ.. సెలక్టర్లకు బంతితో బదులు..

