Kurnool Bus Accident | కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించిన సమాచారం. ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనలో బస్సును ఢీకొట్టిన బైకర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్.. ఓ పెట్రోల్ బంక్‌లో ఆగాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. శివశంకర్‌తో పాటు మరో యువకుడు బైక్‌పై అక్కడకు వచ్చాడు. అతడిని అక్కడ డ్రాప్ చేసి.. శివశంకర్ ఒక్కడే బయలు దేశారు. ఆ సమయంలోనే శివశంకర్ బైక్.. బస్సును ఢీకొట్టింది. ఘోర ప్రమాదం జరిగింది.
Read Also: శక్తులున్న చెంబు అంటూ రూ.1.5కోట్లు టోకరా..

