Rice Pulling Scam | మోసాలు చేయడానికి కేటుగాళ్లు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. కేటుగాళ్లు తెలివి మీరుతున్నా, బాధితులు కనీస ఆలోచన చేయడం లేదా అనేది అర్థం కావడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. చెంబులో డబ్బులు వేస్తే డబుల్ అవతాయని చెప్పి ఓ మహిళా డాక్టర్‌కు ఓ చెంబును అంటగట్టారు కేటుగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన ప్రియంక అనే వైద్యురాలిని, మహిమగల చెంబు పేరుతో మోసం చేసిన విశాఖపట్నం అరకులోయకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజు అనే వ్యక్తులు మోసం చేశారు.
Rice Pulling Scam | తమ వద్ద రూ.30 కోట్లు విలువ చేసే మహిమగల చెంబు ఉందని, అందులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని వైద్యురాలిని నమ్మించి రూ.1.50 కోట్లు వసూలు చేశారు. ఆరు నెలల గడుస్తున్నా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిందా వైద్యురాలు. నిందితులను అదుపులోకి తీసుకుని రూ.2,42,400 నగదు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

