కర్నూల్(Kurnool) బస్పు ప్రమాదానికి సంబంధించి మరో సంచలన అంశం వెలుగు చూసింది. బస్సులో పార్సిల్‌గా వేసిన మొబైల్ ఫోన్లు మంటలను మరింత అధికం చేయడంలో కీలకంగా మారాయని అధికారులు చెప్తున్నారు. బస్సు లగేజ్ విభాగంలో ఉంచిన 234 కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేయగా.. అవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది.
Kurnool Bus Tragedy | కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. మొబైల్ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ వెల్లడించారు.
Read Also: కర్నూల్ ప్రమాదం.. మద్యం మత్తులో ఉన్న బైకర్ వీడియో వైరల్

