జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు సల్మాన్ ఖాన్(Salman Khan)పై కేసు నమోదు కావడం కీలకంగా మారింది. ఉపఎన్నికకు తాము వేసిన నామినేషన్లను సరైన కారణాలు లేకుండానే తిరస్కరించారంటూ రిటర్నింగ్ అధికారిని సల్మాన్ నిలదీశారు. దీంతో అతనిపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఉపఎన్నికలో భాగంగా సల్మాన్ ఖాన్.. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాగా, వాటన్నింటిని అధికారులు తిరస్కరించారు.
దీంతో అధికారులతో సల్మాన్ ఖాన్(Salman Khan) వాగ్వాదానికి దిగాడు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్లో కొన్ని కాలమ్స్ నింపకపోయినా అనుమతించారని, తన నామినేషన్లను మాత్రం ఎలా తిరస్కరించారు? అని ప్రశ్నించారు సల్మాన్ ఖాన్. దీంతో రిటర్నింగ్ అధికారి ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే కలుగజేసుకున్న పోలీసులు.. సల్మాన్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం రిటర్నింగ్ అధికారి సాయిరామ్ ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.

