కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (Columbia India Business Conference) 2026లో పాల్గొననున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు.
భారతదేశ ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, మారుతున్న వ్యాపార రంగంపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చలు జరగనున్నాయి. వారం రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో కేటీఆర్ (KTR) పలువురు పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడిదారులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలుగు ప్రవాస భారతీయులు కూడా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతారా?: సింగిరెడ్డి
Follow Us On : WhatsApp

