కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో (Challapalli Police Station) భారీ పేలుడు చోటుచేసుకుంది. నిల్వ ఉంచిన బాణసంచా పేలి పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బయట నుంచి తెచ్చిన మందు గుండు సామగ్రిని పోలీస్ స్టేషన్‌లో పరిశీలిస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఎస్‌ఐ తో పాటు నలుగురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతోంది.
గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వినికిడి. కాగా, ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ కేఎస్ రావు పేలుడు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: తిరుపతిలో విషాదం: రీల్స్ చేస్తూ బాలిక మృతి !
Follow Us On : WhatsApp

