సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతారా?: సింగిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ నీటిని ఆంధ్రాకు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలిక ఒప్పందంలో కృష్ణా జలాల్లో కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యవహరిస్తోందన్నారు. ఎలాంటి ఇండెంట్లు లేకుండా ఆంధ్రాకు నీటిని తరలిస్తుంటే.. రేవంత్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.

గత రెండేళ్లలో ఏపీ అతి ఎక్కువగా నీళ్లను తరలిస్తే, తెలంగాణ అతి తక్కువగా వాడుకుందని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలో పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. నోటికాడికి వచ్చే బుక్క నేలపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతారా? అంటూ సింగిరెడ్డి (Singireddy) ఎద్దేవా చేశారు.

Read Also: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>