కలం, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని మాఘ్రా ప్రాంతంలో ఉన్న శీతల మాతా ఆలయంలో (Sheetala Mata Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజల కోసం పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి వచ్చారు. ఆలయం కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాటకు (Stampede) దారితీసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు అధికారులు స్థానిక గ్రామస్థులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
భక్తుల ఆర్తనాదాలతో ఆలయం (Sheetala Mata Temple) వీధుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆలయంలో రెస్క్యూ కొనసాగుతోంది. మృతి చెందిన వారంతా మహిళలేనని సమాచారం. ప్రశాంతంగా ఉండే ఆధ్యాత్మిక క్షేత్రం.. ఒక్కసారిగా రణరంగంగా మారి, మృతుల బంధువులు ఆర్తనాదాలతో భయానక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ట్రంప్ సంచలన నిర్ణయం!
Follow Us On : WhatsApp

