తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఘాటు విమర్శలు చేశారు. రేవంత్‌యే తుపాకీ ఇచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించేలా చేశారని కొండా సురేఖ కూతురు సుశ్మిత చేసిన ఆరోపణలు గుర్తు చేశారు కేటీఆర్. సుశ్మిత మొఖంపై ఉమ్మేసినట్లు ఆరోపణలు చేసినా.. కొండా సురేఖ(Konda Surekha)ను మంత్రి పదవి నుంచి తొలగించలేకపోయావ్ నువ్వే సీఎంవి రేవంత్ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి మా ఇంటి మీదకి పోలీసులను పంపిండు అని మంత్రి కొండా సురేఖ కూతురు అన్నది. మంత్రి కొండా సురేఖ నిందితుడిని తీసుకెళ్తుంటే పోలీసులు చేతులు కట్టుకొని చూస్తున్నారు. 2,3 రోజులు తిట్టుకున్నాక తిరిగి రేవంత్ రెడ్డి, కొండా సురేఖ దంపతులు కలిసి శాలువాలు కప్పుకొని స్వీట్లు పెట్టుకున్నారు. వీళ్లకు సిగ్గుందా అసలు?’’ అని ప్రశ్నించారు.
అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ‘‘ఓపెన్‌గా ఇంత జరుగుతుంటే బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేస్తుంటే, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడుతుంటే బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు. సీబీఐ లాంటి సంస్థలు ఎందుకు రావడం లేదు’’ అని నిలదీశారు. రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవదని గుర్తించినందుకు ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్(KTR).
Read Also: కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

