మంత్రులు చేసిన తప్పులకు మీరు బలి కావొద్దంటూ తెలంగాణ ఐఏఎస్‌లకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రిక్వెస్ట్ చేశారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. మంత్రులు చేసిన తప్పులకు ఐఏఎస్‌లు బలవుతున్నారని, ఇప్పుడు రిజ్వీ(Syed Ali Murtaza Rizvi) వీఆర్ఎస్ తీసుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.. మీరు రేవంత్ రెడ్డి లేదా ఇంకో మంత్రి చేసే అరాచకాలకు వత్తాసు పలికితే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు. సీఎం, మంత్రులు చేసే అరాచకాల్లో మేము ఉండమని చెప్పి అధికారులు భయపడుతున్నారు. ఈ మూటల కొట్లాటల్లో మేము ఎందుకు తల దూర్చాలని అధికారులు పారిపోతున్నారు అంటేనే అర్థం చేసుకోండి’’ అని అన్నారు.
‘‘నేను చెప్పినట్లు వినలేదు.. ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటున్నాడు అని అందుకే ఐఏఎస్ అధికారి రిజ్వి పెట్టుకున్న వీఆర్ఎస్‌ను ఆమోదించవద్దని ఎక్సైజ్ మంత్రి జూపల్లి లేఖ రాశాడు. లిక్కర్ టెండర్ తన కొడుకుకి రాలేదని.. రేవంత్ రెడ్డి అల్లుడికి వచ్చిందని ఆ అధికారి మీద కక్ష తీర్చుకోడానికి జూపల్లి చూస్తున్నాడు’’ అని కేటీఆర్ ఆరోపించారు.
‘‘ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో రూ.500 కోట్ల టెండర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం, మంత్రి జూపల్లి తన కొడుకు కోసం టెండర్ పంచాయతీ పెట్టుకున్నారు. వీరి మధ్యల నలగలేక సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ(ఐఏఎస్) అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ క్యాబినేట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్న ఐఏఎస్ అధికారి, 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు’’ అని కేటీఆర్(KTR) అన్నారు.
Read Also: ‘నువ్వేం సీఎంవి రేవంత్’.. కేటీఆర్ విమర్శనాస్త్రాలు

